Sunday 21 August 2011

Achintana-1

                                  అచింతన మనిషి స్వభావం. ఆలోచన కొనసాగింపు జీవి నడకకు వ్యతిరేకం. సహజ స్థితిలో చింతనకు స్తానం లేదు. చింతన లేకపోతే  మనం మిగలం. తరతరాలుగా వస్తున్న ఆలోచన (భావజాలం)  కోనసాగింపే నేను, నా  స్వభావం. ఈ భావజాలం   మన సొంత  అనుభూతి ,మన సొంత  అనుభవంగా  భావిస్తాం. కలవరిస్తూ పలవరిస్తుంటాం.  జీవి (మనిషి) నడకకు సమాంతరంగా నడుస్తున్న ఈ భావజాలం  నుంచి బయట పడి  మనిష తన  సహజ స్థితిలోకి రావడం  ఎలా అనేదే అసలు  ప్రశ్న. మనిషి మనిషి  కోసం వెతులాట. సహజంగా   ఉండేందుకు ఎడతెగని ప్రయత్నం.  ఆజ్నాచక్రాన్ని మేలుకొల్పాలనో ,కుండలిని జాగృతం చేయాలనో , ఆలోచనరహిత స్థితిలోకి  వెళ్ళాలనో  కటోర  సాధనలు    చేస్తుంటాం. వీటికి భిన్నంగా  భౌతికవాదులమంటూ డార్విన్  పరిణామక్రమాన్నో వల్లివేస్తుంటాం.  మరోవైపు  సాధనలతోనో , ప్ర య త్నాలతోనో  సహజ స్తితిని పొందలేమంటూనే  వాటిల్లో మునిగిపోతుం టాం  . పరిణామ క్రమం  తన  క్రమాన్ని నమూనాగాతీసుకుని భవిష్యత్తు సృష్టి చేయదు . మన చర్యలన్నీ  ఆలోచన (సమాజం, నాగరికత, సంస్కృతి ) కొనసాగింపులో భాగమేననే  వాస్తవాన్ని మనం  అంగీకరించం. అంగీకరిస్తే మనం మిగలం.